Header Banner

రైల్వే ప్రయాణికులకి గట్టి హెచ్చరిక.. ముఖ్యమైన రూల్స్ ఇవే! ఈ వస్తువులు తీసుకొస్తే జైలు ఖాయం!

  Wed Apr 23, 2025 17:25        Travel

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ ఉన్న దేశాలలో ఇండియన్ రైల్వే నాల్గవ స్థానంలో ఉంది. ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడంలో ఇండియన్ రైల్వే ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రయాణీకుల ప్రయాణ సమయంలో కొన్ని నియమాలను విధించింది. ఈ రైల్వే నియమాలను ప్రతి ప్రయాణీకుడు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే కఠినమైన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మీరు ఏ ఏ వస్తువులను రైలులో తీసుకెళ్లకూడదు? ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

రైల్వే నియమాలు
ప్రయాణికుడు ఎట్టిపరిస్థితిలోనూ స్టవ్‌లు, గ్యాస్ సిలిండర్లు, మండే రసాయనాలు, బాణసంచా, గ్రీజు, సిగరెట్లు, పేలుడు పదార్థాలు వంటి దుర్వాసన వచ్చే పదార్థాలను రైళ్లలో తీసుకెళ్లకూడదు.

నిబంధనల ప్రకారం, రైలులో గ్యాస్ సిలిండర్‌లను తీసుకెళ్లడం నిషేధం. అయితే, వైద్య అత్యవసర పరిస్థితిలో ఆక్సిజన్ సిలిండర్ల కోసం రైల్వే వివిధ సౌకర్యాలను కల్పిస్తుంది.

రైల్వే నిబంధనల ప్రకారం హైడ్రోక్లోరిక్ యాసిడ్, టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్, నూనె, గ్రీజు మొదలైన ప్రమాదకరమైన ద్రవాలను తీసుకెళ్లడం నిషేధించింది.

ప్రయాణీకుడు పెంపుడు జంతువును తనతో తీసుకెళ్లాలనుకుంటే, ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

అంతేకాకుండా, రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎట్టిపరిస్థితిలోనూ టెంకాయను తీసుకెళ్లకూడదు. ఎందుకంటే, ఎండిన కొబ్బరికాయ బయటి భాగం గడ్డి వంటి పీచు పదార్థాలు కలిగి ఉంటుంది. ఇది అగ్ని ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అందువల్ల, రైలు ప్రయాణంలో టెంకాయ నిషేధించారు.

రైల్వే నిబంధనల ప్రకారం, ఏ ప్రయాణీకుడు మద్యం సేవించి లేదా మాదకద్రవ్యాలతో రైలులో ప్రయాణించకూడదు. 1989 రైల్వే చట్టం దీని కోసం సెక్షన్ 165 కింద కఠినమైన చట్టాలను ఏర్పాటు చేసింది. ప్రయాణీకుడు ఎవ్వరైనా సరే మత్తు పదార్థాలను సేవించడం, మత్తులో ఉండటం, ఆటంకాలు సృష్టించడం లేదా రైలు ప్రాంగణంలో ఇతర ప్రయాణీకులను వేధించడానికి ప్రయత్నించడం కనిపిస్తే, వారి టికెట్‌ను తక్షణమే రద్దు చేసే నియమం ఉంది. అంతేకాకుండా, ప్రయాణీకుడు రైల్వే పాస్ హోల్డర్ అయితే వారి పాస్‌ను కూడా రద్దు చేయవచ్చు. నియమం ప్రకారం, దోషిగా తేలితే ఆ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తారు.

భారతీయ రైల్వేల నియమం ప్రకారం, రైలులో నిషేధిత వస్తువులతో ప్రయాణీకుడు పట్టుబడితే రైల్వే వారిపై కఠిన చర్య తీసుకుంటుంది. ప్రయాణీకుడికి రూ. 1,000 జరిమానా, రెండు లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. నిషేధిత వస్తువుల కారణంగా రైల్వే ఆస్తికి ఏదైనా నష్టం జరిగితే, ఆ ప్రయాణీకుడు జరిగిన నష్టానికి అయ్యే ఖర్చును కూడా భరించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి: వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndianRailways #RailwayRules #PassengerAlert #TravelWarning #ProhibitedItems #RailwayLaw